|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 08:59 AM
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫెర్ త్రయం 'ఎల్ 2: ఎంప్యూరాన్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, మంజు వారియర్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 1 గంటకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఎల్ 2 ఎంప్యూరాన్ 2019 హిట్ లూసిఫర్‌కు సీక్వెల్. ఆశీర్వాద్ సినిమాస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ఆంటోని పెరుంబవూర్ మరియు అల్లిరాజా సుభాస్కరన్ సంయుక్తంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు.
Latest News