|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:08 PM
హీరోయిన్ సదా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. ఈ విషయాన్నీ సదా కాసేపటికి క్రితమే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తండ్రి మరణావార్తని ప్రకటిస్తూ భావోద్వేగానికి లోనైంది. ఇక ఈ విషయం తెలిసి నటీనటులు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. అయితే గతవారం ఆయన చనిపోయినట్టు వెల్లడించారు.'నేను తన కూతురు కావడం గర్వకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవారు. కానీ ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసం ప్రేమ, ఆప్యాయతని పంచిన ఆయనని చూసి గర్వపడుతున్నాను. ఆయన నిజంగా ఓ వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్న' అని సదా ఎమోషనల్‌గా అవుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.మహారాష్ట్రకు చెందిన సదా తండ్రి ముస్లిం కాగా తల్లి హిందూ. ఈయన డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. సదా టీనేజీలో హీరోయిన్ అయిపోయింది. 2002లో 'జయం' సినిమాతో నటిగా మారింది. తర్వాత ప్రాణం, నాగ, దొంగా దొంగది, లీలా మహల్ సెంటర్, చుక్కల్లో చంద్రుడు, అపరిచితుడు, వీరభద్ర తదితర చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లలో హీరోయిన్‌గా ఆఫర్స్ తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు మూవీస్ చేసింది. మరోవైపు రియాలిటీ షోకు జడ్జిగానూ చేసింది. చివరగా 'మదగజరాజా' సినిమాలో కనిపించింది.
Latest News