|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:05 PM
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం ఒక యాడ్ షూటింగ్‌లో స్వల్ప గాయాల పాలయ్యారు. ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఊహాగానాలను నమ్మవద్దని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. షూటింగ్ సమయంలో అనుకోకుండా కిందపడటంతో గాయాలైనట్లు సమాచారం.
Latest News