|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 04:48 PM
'లిటిల్‌హార్ట్స్' చిత్ర విజయంతో నూతన తారలతో రూపొందిన చిత్రాలకు మంచి ఉత్సాహాం వచ్చింది. ఆ కోవలోనే ఈ వారం థియేటర్‌లోకి వచ్చిన చిత్రం 'బ్యూటీ'. అంకిత్ కొయ్య హీరోగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంది. ఇక థియేటర్‌లోకి వచ్చిన 'బ్యూటీ' ఆకట్టుకుందా? ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా రివ్యూలో తెలుసుకుందాం
కథ: నారాయణ (నరేష్) ఓ మిడిల్‌క్లాస్ తండ్రి. వైజాగ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. ఆయన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ఎంతో ప్రాణం. కూతురు అడిగింది కాదనుకుంటా అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. కూతురు ఆనందంగా ఉంటే మురిసిపోతుంటాడు. పుట్టినరోజున స్కూటర్ కావాలని మారం చేసిన కూతురుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించపోయినా స్కూటర్ కొనిస్తాడు నారాయణ. ఇక ఇంటర్మిడియట్ చదవే నీలఖికి, పెట్ ట్రైనర్ (అంకిత్ కొయ్య)తో మొదలైన గొడవ కాస్త ప్రేమగా మారుతుంది. ఓ రోజు అలేఖ్య.. అర్జున్‌తో వీడియో కాల్‌లో అసభ్యకరంగా మాట్లాడటం ఆమె తల్లి (వాసుకీ) చూస్తుంది. దీంతో అలేఖ్య, అర్జున్‌తో కలిసి హైదరాబాద్‌కు పారిపోతుంది. ఇక తండ్రి నారాయణ ఈ ఇద్దర్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? హైదరాబాద్‌లో నారాయణకు ఎదురైన పరిస్థితులేమిటి? అలేఖ్య ఏమైంది? ఈ ప్రేమజంటకు అనుకోకుండా కలిసిన ఓ క్రైమ్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధమేమిటి ? ఆ తండ్రికి కూతురు దొరికిందా? ఈ ఇద్దరి ప్రేమ కథ ఏమైంది? అనేది మిగతా కథ
Latest News