|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 02:44 PM
‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకున్నారంటూ వచ్చిన వార్తపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీపిక తన పారితోషికాన్ని 25 శాతం పెంచారని, తనతో పాటు వచ్చే సిబ్బంది(25 మంది)కి కూడా ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించాలని కోరారని టాక్. ఇవేకాదు, షూటింగ్‌కు రోజుకు 7 గంటలు మాత్రమే హాజరవుతానని కండీషన్ పెట్టారట. ఆమె రెమ్యునరేషన్ పెంచేందుకు ఒకే చెప్పినా, షూటింగ్ టైం తగ్గించడానికి మేకర్స్ ఒప్పుకోలేదని సమాచారం. ఈ ఏడాది చివరిలో 'కల్కి2' షూటింగ్ ప్రారంభం కానుంది.
Latest News