|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 08:40 PM
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన "సుందరకాండ" చిత్రం ఆగష్టు 27న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్ ఆమె తల్లిగా నటించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం సెప్టెంబర్ 23న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రాకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, అభినవ్, సత్య, లక్ష్మి, సునైనా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ప్రదీష్ ఎమ్ వర్మ చిత్ర విజువల్స్‌ను సంగ్రహించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళ త్రయం ఈ సినిమాని నిర్మించారు.
Latest News