|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 08:38 PM
అధ్యక్షా..." ఒక్కే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన కమెడియన్ సుమన్ శెట్టి. నితిన్ హీరోగా వచ్చిన జయం చిత్రంతో తనSeparate Comedy Styleతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో తన వినూత్న కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. ఓ దశలో సినిమాల్లో మంచి బిజీ షెడ్యూల్ కొనసాగించిన సుమన్ శెట్టి, కొంతకాలంగా మాత్రం తెరపై కనిపించకుండా గ్యాప్ తీసుకున్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి, బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మళ్లీ తన కెరీర్‌ను రీస్టార్ట్ చేశారు.ఇక తాజాగా సుమన్ శెట్టిని గురించి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు"అతన్ని తొలిసారి కలిసినప్పుడు, 'సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆలస్యం చేయకుండా వెంటనే ఓ ప్లాట్ కొనుగోలు చేసేయి' అని చెప్పాను" అని తేజ గుర్తు చేశారు.అలాగే "నిజంగానే సుమన్ ఓ స్థలం కొని, అందులో ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆ తర్వాత నన్ను కలిసినప్పుడు – 'ఇది అంతా మీ వల్లే సార్' అంటూ నా కాళ్లు తాకాడు.అప్పుడు నేననన్నా – 'నాకిది ఇష్టం లేదు. నా కాళ్లు తాకకే. నా కోసం చేస్తావంటే... రేపు ఎప్పుడైనా నేను రోడ్డుపైకి వచ్చే పరిస్థితి వస్తే, నీ ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంచు' అని చెప్పాను." అని తేజ వెల్లడించారు."నిజంగా ఆయన నా మాట మర్చిపోలేదు. తన ఇంట్లో నాకు ఓ గది కట్టించి, అందులో నా ఫోటో పెట్టి ప్రతిరోజూ శుభ్రం చేస్తూ చూసుకుంటూ ఉన్నాడు" అని తేజ చెప్పారు.తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం వంటి చిత్రాల్లో సుమన్ శెట్టికి మంచి పాత్రలు దక్కాయి. అందుకే తేజను 'గాడ్‌ఫాదర్' అంటూ సుమన్ శెట్టి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు.కమెడియన్‌గా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించిన సుమన్ శెట్టి, తన సొంత శైలిలో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
Latest News