|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:40 PM
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "ఈ సినిమా టీమ్ మొత్తం యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. తిరువీర్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంటాడు. ప్రీ వెడ్డింగ్ షో లాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలి" అని ప్రశంసించారు. తిరువీర్ మాట్లాడుతూ... కథ నచ్చడంతో రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో భాగం అయ్యానని తెలిపారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.
Latest News