|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:11 PM
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన ప్రశంసలు అందాయి. ఈ చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “‘కిష్కింధపురి’ సినిమా నాకు నిజంగా బాగా నచ్చింది. ఇది కేవలం సాధారణ హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి ఎంచుకున్న సైకలాజికల్ యాంగిల్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది” అని కొనియాడారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన ఎంతో బాగుందని, అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని మెచ్చుకున్నారు.
Latest News