|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 09:40 PM
'దసరా విలన్'గా గుర్తింపు పొందిన షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన కామెడీ-సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూత్రవాక్యం, ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో కొత్త ఊపొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళ థ్రిల్లర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అద్భుత స్పందన అందుకుంటోంది.తాజాగా, ఓటీటీలో ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి కొత్త రికార్డు నెలకొల్పింది. థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో మాత్రం సూత్రవాక్యం మంచి జోష్‌తో దూసుకెళ్తోంది. దీనిని తెలియజేస్తూ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.ఈ సినిమాకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కండ్రాగుల ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి, తన నటనతో ప్రత్యేకంగా నిలిచాడు. క్రైమ్, కామెడీ, థ్రిల్ అంశాలతో మిళితమైన ఈ కథ, ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
Latest News