|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 07:37 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్ కోసం జతకట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. అల్లు అర్జున్ ఇటీవలే ముంబై షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ని అక్టోబర్ లో అబు దాబిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మాగ్నమ్ ఓపస్ చిత్రంలో స్టార్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేయనున్నారు.
Latest News