|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:36 PM
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'వృషభ' నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, ఆశీర్వాద్ సినిమాస్‌తో పాటు పలు ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 18న టీజర్ విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పురాణాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
Latest News