|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 02:21 PM
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై జేఏసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు ర్యాలీగా బయలుదేరారు. శనివారం ఈ ర్యాలీ తెలంగాణ భవన్, పంజాగుట్ట చౌరస్తా, బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మూట గోపాల్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ సభ్యులు బడుగు లింగ యాదవ్, మాజీ చైర్మన్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బంద్ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.