|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 10:26 AM
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టిస్తుంది. కుండపోత వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు విమానాలను దారి మళ్లించారు. విమానాశ్రయ అధికారులు మొత్తం 9 విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి పంపించారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.