|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 10:49 PM
రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగులు తమ వేతన సమస్యలు మరియు ఇతర డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు. 38 నెలలుగా జీతాలు అందకపోవడంతో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగినా, కనీసం ఒక నిర్ణయానికి రాలేదు.ప్రధాన డిమాండ్: 38 నెలల బకాయి వేతనాలను చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి.రేపు అంటే ఆగస్టు 5, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బస్సులను నిలిపివేస్తారు. హైకోర్టు సమ్మెను వాయిదా వేయాలని సూచించినా, ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.*ప్రభుత్వ చర్యలు :ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ బస్సులను రంగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 10,000 ప్రైవేట్ బస్సుల సేవలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినా, ఇంకా స్పష్టత రాలేదు. బెంగళూరులో IT ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వమని కంపెనీలకు సూచించబడింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కార్మికులతో చర్చలు జరిపినప్పటికీ, అవి ఫలించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు – ముఖ్యమైనవి, 38 నెలల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలిప్రభుత్వ, ఉద్యోగుల స్థాయిలో వేతనాలు ఇవ్వాలి,ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి,కార్మికులపై వేధింపులు, అవినీతిని నిలిపివేయాలి,నగదు రహిత వైద్య సౌకర్యాలు కల్పించాలి,బస్ డిపోలలో నాణ్యమైన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి,గత సమ్మెల్లో నమోదైన కేసులను ఉపసంహరించాలి,ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవింగ్‌కు RTC డ్రైవర్లనే నియమించాలి.ఈ బస్సుల నిర్వహణ ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించకూడదు ప్రజలపై ప్రభావం సుమారు 1.15 లక్షల మంది RTC ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నందున, ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పెద్ద అసౌకర్యాన్ని కలిగించనుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరియు రోజువారీ ప్రయాణికులు ఈ సమ్మె వల్ల తీవ్రంగా ప్రభావితమవుతారు.