|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 02:12 PM
TG: అసెంబ్లీలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో BRS ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆదివారం స్పీకర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఈరోజు ఉ. 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.