|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 01:50 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కవిత ఎవరో తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. సోమవారం నల్గొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్‌లు, బనకచర్లపై కేంద్రంతో కొట్లాడతామన్నారు. ఎలాగైనా బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటామని మంత్రి తెలిపారు.