|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 02:46 PM
ఒక వ్యక్తి దగ్గర డబ్బు దొంగిలించిన దొంగను 24 గంటల్లో పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. మల్లెపెళ్లి గ్రామానికి చెందిన విజ్జగిరి బానయ్య సోమవారం బ్యాంకులో రూ. 50వేలను తీసుకొని పని నిమిత్తం కరీంనగర్ కు వెళ్లడానికి మంథని బస్టాండ్ లో బస్సు ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ టికెట్ డబ్బులు అడగగానే తన జేబులో ఉన్న రూ. 50 వేలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, దొంగతనానికి పాల్పడిన రాజయ్యను మంగళవారం అరెస్ట్ చేశామని మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు.