|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 04:29 PM
జగపతిబాబు - మీనా కొన్ని సినిమాలలో కలిసి నటించారు. అందువలన వాళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతోనే ఆయన ఆమెతో మాట్లాడారు. మీనా భర్తను కోల్పోవడం గురించి జగపతిబాబు ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తాను రాలేకపోయినందుకు సారీ చెప్పారు. ఆమె ముఖం చూడటానికి తనకి ధైర్యం సరిపోలేదనీ, అందువల్లనే తాను రాలేకపోయానని అన్నారు. అందుకు మీనా స్పందిస్తూ .. "తాను చాలా దుఃఖంలో ఉన్న సమయంలో తన స్నేహితులు అండగా నిలిచారనీ, బాధపడుతూ ఇంట్లో కూర్చోవద్దని చెప్పి బయట ప్రపంచంలోకి తీసుకుని వచ్చారని చెప్పారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ వారు తనకి రెండో పెళ్లి అంటూ తమకి తోచింది రాసేయడం చాలా బాధ కలిగించిందనీ, అంత అసహ్యంగా ఎలా రాయగలిగారని అనిపించిందని అన్నారు. కొంతమంది అదే పనిలో ఉంటారనీ, అలాంటి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదని జగపతిబాబు చెప్పారు.
Latest News