|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 04:27 PM
తమిళ నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. గాయని కెనిషాతో ఆయన ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వస్తున్న వదంతులకు బలం చేకూర్చేలా, వీరిద్దరూ కలిసి కెమెరా కంట చిక్కారు. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వీరిద్దరూ జంటగా హాజరయ్యారు.జయం రవి, కెనిషా స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వీరి మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న ప్రచారానికి ఈ ఫొటోలు మరింత ఆజ్యం పోశాయి.
Latest News