|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:32 PM
ప్రముఖ దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్రల చేతుల మీదుగా "యంగ్ అండ్ డైనమిక్" సినిమా ట్రైలర్ ఇటీవల ఘనంగా విడుదలైంది. శ్రీరామ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ రామ్ హీరోగా, మిథున ప్రియ హీరోయిన్‌గా నటించారు. కిషోర్ శ్రీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఓ రౌడీ కథగా రూపొందింది. ట్రైలర్ చూసిన అతిథులు హీరో శ్రీరామ్ నటనను, డైలాగులను, ఫైట్ సీక్వెన్స్‌లను ప్రశంసించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో తెలిపిన అతిథులు, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
Latest News