|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 05:56 PM
మోలీవుడ్ యొక్క తాజా సూపర్ హీరో చిత్రం లోక్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. కళ్యాణి ప్రియద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా రన్ అవుతుంది. ఇటీవలే ఈ చిత్రం 200 కోట్ల మార్క్ ని చేరుకొని చరిత్ర సృష్టించింది. ఈ మైలురాయిని తాకిన మూడవ వేగవంతమైన మలయాళ చిత్రం కూడా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కేరళ బాక్స్ఆఫీస్ వద్ద 75 కోట్ల గ్రాస్ ని రాబట్టి బాహుబలి 2 కలెక్షన్స్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. డొమినిక్ అరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు మరియు తమిళ వెర్షన్స్ కి కూడా భారీ స్పందన లభిస్తుంది. ఈ చిత్రంలో నెల్సన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రంలో టోవినో థామస్, సన్నీ వేన్ మరియు దుల్కర్ సల్మాన్ అతిధి పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో శాండీ మాస్టర్ విలన్ పాత్ర పోషిస్తాడు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని నిర్మించారు.
Latest News