![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:48 PM
ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగుకు వస్తుండగా వాటిలో చాలా వరకు ప్రధాన కంటెంట్ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్ కేవలం అమెజాన్, నెట్ఫ్లిక్స్లలోనే వస్తుండడం విశేషం. వీటిలో ముఖ్యంగా హీరోయిన్ సమంత నిర్మాతగా మారి మొట్ట మొదటి సారి నిర్మించిన శుభం, మలయాళ యువ నటుడు, ప్రేమలు హీరో నటించిన అలప్పుజ జింఖానా, నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలెవన్ చిత్రాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కేసరి2, తమిళ చిత్రాలు మామన్, డీడీ నెక్స్ట్ లెవల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. థియేటర్లలో ఈ సినిమాలను మిస్సయిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ సరిపోను వినోదం అందించడానికి రెడీగా ఉన్నాయి.
Latest News