![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:59 PM
నేచురల్ స్టార్ నాని, శైలేశ్ కొలను కాంబినేషన్లో 'హిట్ 3' చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్ కు మాత్రం 'హిట్ 3' చిత్రం మాంచి కిక్ ఇచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ 3 సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 100 కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేసింది. ఇక, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. 'హిట్ 3' రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో రాబోతోంది. మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా... నాని సరసన హీరోయిన్గా కన్నడ భామ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
Latest News