![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:58 PM
హిందీ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. 'సన్ ఆఫ్ సర్దార్', 'ఆర్.. రాజ్‌కుమార్', 'జై హో' వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన ఆయన స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తను సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముకుల్ దేవ్‌తో ఉన్న పాత చిత్రాన్ని పంచుకుంటూ "RIP" అని పేర్కొన్నారు. ముకుల్ దేవ్, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్‌కు సోదరుడు. ఆయన చివరిగా 'అంత్ ది ఎండ్' అనే హిందీ సినిమాలో కనిపించారు.
Latest News