![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:58 PM
మలయాళం నుంచి హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమాలు వచ్చాయంటే, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మలయాళంలో రూపొందిన మరో హారర్ థ్రిల్లర్ గా 'హంట్' కనిపిస్తుంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను రాధాకృష్ణన్ నిర్మించగా, షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. రేంజి పణిక్కర్ .. చందూనాథ్ .. అనూ మోహన్ .. అజ్మల్ అమీర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, క్రితం ఏడాది ఆగస్టు 23వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ నెల 23వ తేదీ నుంచి 'మనోరమ మ్యాక్స్' ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాలో కీర్తి పాత్రలో భావన కనిపిస్తుంది. ఫోరెన్సిక్ డిపార్టుమెంటులో కీర్తి పనిచేస్తూ ఉంటుంది. ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పరిశీలించవలసి వస్తుంది. ఆ సమయంలో ఆమెకి కొన్ని చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అందుకు కారణం ఏమిటి? హత్యకి గురైనది ఎవరు? చేసింది ఎవరు? ఆ సంఘటనతో కీర్తికి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
Latest News