![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:37 PM
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఆహాలో ఈ చిత్రం మే 23న ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కళ్యాణ్ రామ్ కి తల్లిగా మరియు IPS ఆఫీసర్గా కమాండింగ్ పాత్రలో నటించగా, సాయి మంజ్రేకర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ శక్తివంతమైన విరోధిగా నటిస్తుండగా, శ్రీకాంత్, పృథ్వి రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, మ్యూజిక్ కంపోజర్ అజనీష్ లోక్నాథ్, ఎడిటర్ తమ్మిరాజు మరియు స్క్రీన్ ప్లే రైటర్ శ్రీకాంత్ విస్సాతో సహా అద్భుతమైన సాంకేతిక బృందం ఉంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.
Latest News