![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 02:44 PM
టాలీవుడ్ నటుడు నాని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఒడెలాతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'ది ప్యారడైజ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క ప్రకటన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థీమ్ OST ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి మరియు ఇప్పటికే ప్రీ లుక్, రా స్టేట్మెంట్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ ట్యూన్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 26 మార్చి 2026న విడుదల కానుంది.
Latest News