![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 06:20 PM
కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన 'గగన్ మార్గన్' జూన్ 27న విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 1000+స్క్రీన్స్ లో విడుదల అయ్యినట్లు అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్వహిస్తుండగా, యువా ఎస్ కెమెరా మరియు రాజా ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. హత్య మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రానికి ప్రశంసలు పొందిన ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ క్రింద ఈ సినిమా నిర్మించబడింది.
Latest News