![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:50 AM
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ' ఆగష్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్ మరియు ఆకట్టుకునే కథాంశంతో కూడిన థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించింది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. తన బహుముఖ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. సౌబిన్ షాహిర్, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్‌ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ప్రశంసలు అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Latest News