|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:43 PM
జైన్స్ నాని దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బావరం ప్రధాన పాత్రలో నటించిన తన రాబోయే చిత్రం 'కె-ర్యాంప్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇటీవల మార్కోలో కనిపించిన నటి యుక్తి థారెజా మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వెన్నెల కిషోర్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ సినిమాలో జంటి అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. హస్యా మూవీస్ బ్యానర్ కింద రేజేష్ దండా నిర్మించిన, బాలాజీ గుత్తా మరియు ప్రభాకర్ బురుగు సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని చైతన్ భర్ద్వాజ్ స్వరపరిచారు.
Latest News