|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:14 PM
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని నవంబర్ 28, 2025న విడుదల కానున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా మద్దతుతో తొలిసారిగా కిషోర్ గోపుతో రామ్ పోతినేని కలిసి ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక నిర్ధారణ ఇంకా రానప్పటికీ ఈ ప్రాజెక్ట్ జనవరి 2026లో సెట్స్ పైకి వెళుతుందని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా హారర్ జోనర్ లో రానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News