|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 02:53 PM
హైదరాబాద్ పోలీస్ విభాగానికి నటుడు సాయి దుర్గాతేజ్ గురువారం రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ‘హైదరాబాద్ ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సమ్మిట్ 2025’కు అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ మేరకు దుర్గాతేజ్ మాట్లాడుతూ బైక్‌పై వెళ్లేవాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యా. రెండు వారాల పాటు కోమాలో ఉన్నా. ఆ రోజు హెల్మెట్ వేసుకున్నాను కాబట్టే ఈరోజు ఇలా ఉన్నా’ అని ఆయన అన్నారు.
Latest News