|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 01:55 PM
టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ కుదిరినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేయనున్నారు. ఇందులో బలమైన ప్రతినాయకుడి పాత్ర కోసం మనోజ్‌ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇటీవల మిరాయ్ సినిమాలో నెగటివ్ రోల్‌తో ఇంప్రెస్ చేసిన మనోజ్, ఈసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేయబోతున్నారన్న వార్త అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది.
Latest News