|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 11:11 AM
ప్రముఖ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బుధవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన శంకర్ గురువారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, రోబో శంకర్ మారి, మారి -2, మాయ, విశ్వాసం, సింగం-3 వంటి సినిమాల్లో నటించారు. దాదాపు స్టార్ హీరోస్‌తో 100పైగా సినిమాల్లో నటించారు.
Latest News