|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:56 PM
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం సీక్వెల్‌పై చిత్ర బృందం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా వెల్లడించింది. పార్ట్ 2 కథకు ఆమె పాత్రే కీలకం కానున్న తరుణంలో వెలువడిన ఈ వార్త అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగస్వామ్యం ఉండబోదని వారు స్పష్టం చేశారు. "మొదటి భాగం నిర్మాణంలో సుదీర్ఘకాలం కలిసి ప్రయాణం చేసినప్పటికీ, ఈ భాగస్వామ్యంలో అవసరమైన అనుసంధానం కుదరలేదు. ఇంతటి భారీ ప్రాజెక్టుకు సంపూర్ణ నిబద్ధత చాలా అవసరం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
Latest News