|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 02:32 PM
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన 'కాక్టెయిల్' కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఇటీవలే ప్రకటించబడింది. ఈ సీక్వెల్ లో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ రష్మిక మాండన్నా మరియు కృతి సనన్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, షాహిద్ కపూర్ మరియు కృతి సనోన్ ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మేకర్స్ నటీనటుల పై ఒక బీచ్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ పాట సెప్టెంబర్ చివరి వారంలో చిత్రీకరించబడుతుంది అని లేటెస్ట్ టాక్. లవ్ రంజన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, హోమి ఆడజానియా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News