|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 09:13 PM
తమిళంలో విజయం సాధించిన క్రైమ్-సస్పెన్స్ థ్రిల్లర్ 'టన్నెల్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అథర్వా మురళీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా, అశ్విన్ కాకుమాను విలన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. రాజు నాయక్ భవ్యంగా విడుదల చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రైలర్ చూస్తేనే సినిమా ఇంటెన్స్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, సస్పెన్స్ తో నిండి ఉన్న థ్రిల్లర్ అనే అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తియ్యాయి. యూ/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు."సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కేవలం థ్రిల్ మాత్రమే కాదు, ఓ మంచి మెసేజ్‌ను కూడా బలంగా ఇచ్చే ప్రయత్నం చేశారు" అని వారు వ్యాఖ్యానించారు.తమిళంలో అథర్వా–లావణ్య కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తరహాలో, ఇప్పుడు అదే కాంబో తెలుగు ఆడియెన్స్‌ను కూడా అలరించనుంది.ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలిచే అవకాశముంది.ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ శక్తి శరవణన్, ఎడిటింగ్ కలైవానన్ నిర్వహించారు. సెప్టెంబర్ 19న తెలుగు ప్రేక్షకుల కోసం ‘టన్నెల్’ థియేటర్లలో అడుగు పెట్టనుంది.
Latest News