|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:59 AM
ప్రముఖ నటి మంచు లక్ష్మి తన రాబోయే చిత్రం ‘దక్షా' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి హత్య మిస్టరీ అంశాలు ఉన్నాయి. ఈ చిత్రం యొక్క ప్రమోషన్లు అపారమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి. వంశి కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 19 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 'U/A' సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ముఖ్యమైన పాత్రలో నటించగా, సముతీరకాని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వనాధ్, చిత్ర శుక్లా, రంగస్థలం మహేష్, జెమిని సురేష్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అచు రమణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా, గోకుల్ భారతి సినిమాటోగ్రఫీని అందించారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News