|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 02:44 PM
మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు తన అభిమాని అని తెలిసి గర్వపడుతున్నట్లు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మంగళవారం రాంగోపాల్ చిరంజీవిని కలిశారు. "తన అసాధారణ శౌర్యానికి 'కీర్తి చక్ర' గెలుచుకున్న మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత చిన్న వయస్సులోనే ఆయన ప్రదర్శించిన శౌర్యం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం." అని ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Latest News