|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:21 PM
ఏటా మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలను ఈ విద్యా సంవత్సరం కాస్త ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు, ముఖ్యంగా సెకండియర్ చదువుతున్న వారికి ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చే లక్ష్యంతో ఈ మార్పు చేశారు. ఇంటర్ బోర్డు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గురువారం ఆమోదముద్ర వేసింది.సాధారణంగా ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే మొదలుకానున్నాయి. విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో ఈ పరీక్షలు మార్చి 5న ప్రారంభమైన విషయం తెలిసిందే.పరీక్షలను ముందుగా పూర్తి చేయడం వల్ల ఫలితాలు కూడా త్వరగా వెలువడతాయి. ఇది వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి సారించేందుకు అధ్యాపకులకు వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.