|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:22 PM
హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పాఠం వింటున్న ఓ తొమ్మిదేళ్ల విద్యార్థి ఉన్నట్టుండి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.బానోతు సుదీష్ ప్రేమ్ కుమార్ (9) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే గురువారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి, తరగతి గదిలో పాఠం వింటుండగా అకస్మాత్తుగా బెంచీపై తల వాల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, యాజమాన్యం బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, బాలుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు తేల్చారు. గుండె కొట్టుకుంటుండటంతో ప్రస్తుతం అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.