|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 12:45 PM
TG: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌కు విస్తృత స్పందన లభింస్తోంది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐకాస నేతలు RTC డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. బస్సులు డిపోల నుంచి బయలుదేరకుండా అడ్డుకున్నారు. బంద్‌కు మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని బీసీ ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కారణంగా సాధారణ జీవనంపై ప్రభావం పడింది.