|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 12:16 PM
హైదరాబాద్: బీసీ సంఘాలు, అన్ని పార్టీలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, JBS, MGBS, ఉప్పల్, కుషాయిగూడ, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, పరిగి, తాండూర్ సహా అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు, క్యాబ్ లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది.