|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 11:58 AM
TG: బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద జరిగిన బీసీ బంద్‌లో పాల్గొన్న ఆయన, బీసీలు 52 శాతం ఉన్నా 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీసీలకు వారి వాటా కావాలని, యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలని ఆయన అన్నారు.