|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 08:10 PM
పటాన్చెరు : వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే నివాసంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వంటశాల తో పాటు రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా 27వ తేదీ రోజు మహాగణపతికి ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. సెప్టెంబర్ ఆరవ తేదీన జాతర, లడ్డు వేలం పాట, రథోత్సవంతో ముగుస్తాయని తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.