|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 04:02 PM
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైల్వేస్టేషన్‌లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న లవరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7,70,000 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న లవరాజు బెట్టింగ్‌లకు బానిసై చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.