|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 09:34 AM
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక శాలివాహన నగర్‌లోని పార్కు సమీపంలో చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు, దుండగుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.