|
|
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:31 PM
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాదిలో రూ.21,600 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని DyCM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనుకాడదని చెప్పారు. 'ప్రతి నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం' అని మంచిర్యాల సభలో అన్నారు.