|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 10:21 AM
పాశ మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అడ్మినిస్ట్రేషన్, ప్రొడక్షన్ బిల్డింగ్స్ కుప్పకూలడంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 33 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ కు చెందిన వారు ఉన్నారు.